Wednesday, January 22, 2025

హిమాచల్ స్కాలర్‌షిప్ స్కామ్‌పై సిబిఐ చార్జిషీట్లు

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లో కోట్లాది రూపాయల స్కాలర్‌షిప్ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిబిఐ 20 సంస్థలు, 105 మంది వ్యక్తులపై చార్జిషీట్లు దాఖలు చేసిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగరీల విద్యార్థులకు సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు జరిపిన స్కాలర్‌షిప్, రీ ఇంబర్స్‌మెంట్ పథకాల కింద నిధుల దుర్వినియోగంపై విద్యా సంస్థల యజమానులు, సిమ్లాలోని ఉన్నత విద్య డైరెక్టరేట్ సిబ్బంది, బ్యాంకు అధికారులు, ఇతర ప్రైవేట్ వ్యక్తులపై చార్జిషీట్లు దాఖలు చేసినట్లు సిబిఐ ఒక ప్రకటనలో తెలియజేసింది.

36 పథకాల కింద ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించిన రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌లను అర్హులైన విద్యార్థులకు చెల్లించనప్పుడు 2012-13లో ఈ స్కాలర్‌షిప్ కుంభకోణానికి నాంది పడింది. ఎనభై శాతం స్కాలర్‌షిప్ డబ్బును ప్రైవేట్ సంస్థలకు చెల్లించినట్లు ఆరోపించడమైంది. హిమాచల్ లాహౌల్ స్పితి జిల్లాలోని గిరిజిన స్పితి లోయలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గడచిన ఐదు సంవత్సరాలుగా స్కాలర్‌షిప్ చెల్లించలేదని వార్తలు రావడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హెచ్‌పి ప్రభుత్వ వినతిపై సిబిఐ 2019లో ఒక కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News