Monday, December 23, 2024

న్యూస్‌క్లిక్‌పై కదలిక సిబిఐ సోదాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీ నిధుల అభియోగాల కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్‌పై, ఈ సంస్థ వ్యవస్థాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కయస్థపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఫేరా ఇతర చట్టాల ఉల్లంఘన విషయంలో ఈ పోర్టల్ వ్యవస్థాపకుడి నివాసంలో , కార్యాలయంలో సిబిఐ సోదాలు చేపట్టింది. ఇప్పుడు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా సంబంధిత కంపెనీ పిపికె న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేటు లిమిటెడ్, ఎడిటర్ ఇన్ చీఫ్, సంస్థ మేనేజర్, అమెరికన్ మిలియనీరు నెవిలిరాయ్ సింగంల పేర్లను చేర్చారు. ఇప్పుడు సంబంధితుల కార్యాలయాలలో , నివాసాలలో సోదాలు కొనసాగుతున్నాయని సిబిఐ అధికారులు తమ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News