Friday, January 10, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్ లో హైద్రాబాద్ వ్యక్తి పేరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంపై సప్లిమెంటరీ చార్జీషీట్‌ను సిబిఐ అధికారులు గురువారం కోర్టుకు సమర్పించారు. సప్లిమెంటరీ చార్జీషీట్ లో నలుగురిపై సిబిఐ అధికారులు అభియోగాలు మోపారు. హవాలా ద్వారా రూ. 44 కోట్లు మళ్లించినట్టుగా సిబిఐ అధికారులు చార్జీ షీట్‌లో అభియోగం మోపారు. హైద్రాబాద్‌కు చెందిన ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థకు చెందిన సింగ్‌పై కూడ సిబిఐ అధికారులు చార్జీషీట్ లో అభియోగాలు మోపారు. చారియేట్ ప్రొడక్షన్ మీడియా డైరెక్టర్ రాజేష్ జోషీ పేరును కూడ చార్జీషీట్ లో సిబిఐ ప్రస్తావించింది. హవాలా మార్గంలో రూ.44 కోట్లను గోవాకు తరలించారని సప్లిమెంటరీ చార్జీషీట్‌లో సిబిఐ అధికారులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News