Saturday, December 21, 2024

ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ పై విచారణ మరోసారి వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ పై విచారణను కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఛార్జ్ షీట్ కాఫీలో స్పష్టత లేదని గతంలోనే ప్రతివాదుల లాయర్లు చెప్పారు. స్పష్టతతో ఛార్జ్ షీట్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు గతంలోనే సిబిఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇవాళ ఛార్జ్ షీట్ కాపీని ప్రతివాదులకు ఇచ్చినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. ఛార్జ్ షీట్ కాపీలను అనువదించి ఇవ్వాలని ఎంఎల్ సి కవిత న్యాయవాది కోరారు.

ఛార్జ్ షీట్ కాపీలో తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగా లేవని కవితా న్యాయవాది తెలిపారు. ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. సిబిఐ తుది ఛార్జ్ షీట్ పై విచారణను ఈ నెల 25కు కోర్టు వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు నిందితులు హాజరయ్యారు. మద్యం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన తర్వాత కవితకు సైతం అదే తీరులో బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News