Monday, December 23, 2024

నీట్-యుజి కేసులో సిబిఐ తొలి చార్జిషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ యుజి పేపర్ లీక్ కేసులో సిబిఐ గురువారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించింది. లక్షలాది మంది విద్యార్థుల భవితకు గండికొట్టింది. సంబంధిత కేసును సిబిఐ చేపట్టింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 40 మం ది నిందితులను సిబిఐ అరెస్టు చేసిందంఇ. వీరిలో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు.

కాగా 58 ప్రాంతాలలో సంబంధిత ఉదంతంలో సో దాలను నిర్వహించారు. ఈ వరుసలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ కీలకమైన సాక్షాధారాలను సేకరించింది. ఈ క్రమంలో ఇప్పుడు తొలి అభియోగపత్రం దాఖలు చేసింది. ఐపిసి సెక్షన్లు 120 బి, 201, 409, 380, 411, 420 109 సెక్షన్ల పరిధిలో వీరిపై అభియోగాలను ఈ పత్రంలో నమోదు చేశారని వెల్లడైంది.

మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఇప్పటికే 13 మంది నిందితులపై సాక్షాధారాలను సేకరించుకుని, వారిపై నేరాలను సం బంధిత సెక్షన్ల మేరకు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఈ 13 మంది పేర్లను వెల్లడించారు. వీరిలో నితీష్‌కుమార్, అమిత్ ఆనంద్, సికందర్ యద్వేందు, అశుతోషు కుమార్, రోషన్‌కుమార్, అశుతోషు కుమార్ అనే మరో వ్యక్తి, అఖిలేష్ కుమార్, అవదేషు కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, అయూష్ రాజ్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బీహారీలే ఉన్నారని వెల్లడైంది. లీకేజ్ వ్యవహారంలో తొలి కేసు పాట్నాలోని శాస్త్రినగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే దాఖలు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News