Saturday, January 25, 2025

ఆర్‌జి కార్ ఘటన దర్యాప్తు వేగవంతం

- Advertisement -
- Advertisement -

స్థానిక ఆర్‌జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ నెల 17 వరకూ సిబిఐ కస్టడీలో ఉంటారు. లేడీడాక్టర్ హత్యాచారం కేసులో ఘోష్‌ను శనివారం సిబిఐ అరెస్టు చేసింది. ఆదివారం స్థానిక న్యాయస్థానం ఆయనను మంగళవారం వరకూ సిబిఐ కస్టడీకి పంపిస్తూ ఉత్వర్వులు వెలువరించింది. కాగా కేసు దర్యాప్తు తొలి దశలో స్థానిక తాలా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మోండల్ తీరు అనుమానాస్పదం కావడంతో ఈ వ్యక్తికి కూడా అప్పటి వరకూ సిబిఐ కస్టడి ఉంటుంది. మొత్తం మూడు రోజులు వీరి కస్టడికి తమకు అనుమతి లభించిందని , ఇద్దరిని కలిపి విచారించడం జరుగుతుందని సిబిఐ వర్గాలు ఆ తరువాత తెలిపాయి. ఆసుపత్రిలో లేడిడాక్టర్ అత్యాచారం, హత్య ఘటన పలు కీలక మలుపులు తిరుగుతోంది. మాజీ ప్రిన్సిపాల్ పాత్ర పట్ల పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని సిబిఐ పేర్కొంటోంది.

ఘటన జరిగిన రోజుల్లో మాజీ ప్రిన్సిపాల్ ఇక్కడ బాధ్యతలలో ఉన్నాడు. ఇప్పటికే ఈ వ్యక్తి ఆసుపత్రిలో అంతకు ముందటి అవినీతి , మందుల గోల్‌మాల్ కేసులలో జైలు పాలయి ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి స్థానిక పోలీసు అధికారి సాయంతో ఘటనా స్థలిలో సాక్షాదారాలను తారుమారు చేశారనే విషయం కీలకం అయింది . సిబిఐ సమగ్రరీతిలో జరిపే దర్యాప్తు క్రమంలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ దశలో సిబిఐ ఈ ఇద్దరు వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని , విచారించడం కీలక ఘట్టం కానుంది. లేడీడాక్టరు దారుణ అంతం తరువాత ఆసుపత్రి నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు స్పందించిన తీరు నిర్థిష్టంగా ఘటనలోని సాక్షాలను తారుమారు చేసే విధంగా ఉన్నాయనే వాదన సిబిఐ తీసుకువచ్చింది. ఈ క్రమంలో మాజీ ప్రిన్సిపాల్, పోలీసు అధికారిని సంయుక్తంగా విచారించడం వల్ల సిబిఐ ఎటువంటి విషయాలను రాబట్టుతుందనేది కీలకం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News