Monday, December 23, 2024

సిబిఐ డైరెక్టర్ ఎంపికపై నేడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: సిబిఐ డైరెక్టర్‌నుఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశం కానున్నది. ఈ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సిబిఐ డైరెర్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం మే 25వ తేదీతో ముగియనున్నది. సిబిఐ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేయడమా లేక ప్రస్తుత డైరెక్టర్ పదవీకాలం పొడిగించడమా అన్న అంశంపై ఉన్నత స్థాయి కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రక్యాడర్‌కుచెందిన1985 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన జైస్వాల్ గతంలో ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఆయన 2021 మే 26న సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉండే ఉన్నత స్థాయి కమిటీ సిబిఐ డైరెక్టర్‌ను రెండేళ్ల పదవీకాలానికి ఎంపిక చేస్తుంది. సిబిఐ డైరెక్టర్ పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగించే అధికారం ఈ కమిటీకి ఉంది.

Also Read: ఒకడు చిల్ అయ్యాడు… పోలీస్ బాస్ ఔట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News