Sunday, February 2, 2025

మణిపూర్ విద్యార్థుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన సంఘటనపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైందని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రానికి సిబీఐ అధికారుల బృందం చేరుకుందని , సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ అజయ్ భట్నాగర్ సారథ్యం లో దర్యాప్తు ప్రారంభమైందని పేర్కొన్నారు.న బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారన్నారు. ఇంఫాల్‌లో అడుగుపెట్టిన సిబిఐ బృందం ఎక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తోందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రజలంతా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News