Monday, December 23, 2024

కాసేపట్లో వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించనున్న సిబిఐ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సిబిఐ నుంచి తనకు నోటీసు అందలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. విచారణకు రావాలని తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదన్నారు. గతంలో నోటీస్ సందర్భంగా 24 గంటల తరువాత అందుబాటులో ఉంటానని చెప్పానన్నాడు. నేటి విచారణపై సిబిఐ ఎస్‌పి రామ్‌సింగ్‌కు ఫోన్ చేశానని, కానీ సిబిఐ నుంచి తనకు ఎలాంటి సమాధానం లేదన్నారు. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో విచారణకు వస్తానని వివరించాడు. కాసేపట్లో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ విచారించనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విరారణ నిమిత్తం వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News