Wednesday, January 22, 2025

బొగ్గు కుంభకోణంలో అభిషేక్ భార్యను ప్రశ్నించిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: బొగ్గు చోరీ కుంభకోణంలో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఒక మహిళా అధికారితో కూడిన 8మంది సభ్యుల సిబిఐ అధికారుల బృందం మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఇక్కడి హరీష్ ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసం శాంతినికేతన్‌కు చేరుకుంది. ఈ కేసులో అభిషేక్ భార్యను సిబిఐ అధికారులు ప్రశ్నించడం ఇది రెండవసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ ఆమెను ప్రశ్నించింది. సిబిఐ బృందం ఆ ఇంటిని చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కలుసుకోవడానికి అక్కడకు వచ్చారు.

CBI Investigation MP Abhishek’s Wife in Coal Scam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News