Monday, December 23, 2024

ప్రమాదంలో కుట్రకోణం!

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఈ దుర్ఘటనపై సిబిఐ దర్యాప్తుకు రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో విలేఖరులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఘటనా స్థలిలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు.

రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న మంత్రి ఓవర్‌హెడ్ వైరింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. బాధితులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోందన్నారు. రోగులకు ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. వైద్య బృందాలు రోజులో 24 గంటలు రోగుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొంటున్నారని చెప్పారు. మృతు కుటుంబాలను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News