Sunday, January 19, 2025

టిఎంసి ఎంపి మొయిత్రాపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. మొయిత్రాకు వ్యతిరేకంగా ఆరోపణలతో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే సిబిఐ నుంచి కానీ లోక్‌పాల్ నుంచి కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడ లేదు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది.

ఈ ఆరోపణలు ఎంతవరకు తదుపరి దర్యాప్తుకు అవసరపడతాయో ప్రాథమిక పరిశీలించాక సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తుంది. వాణిజ్యవేత్త హీరానందని ప్రయోజనాల కోసం ఆయన దన్నుతో అదానీ గ్రూపును, ప్రధాని మోడీని లక్షంగా చేసుకుని మొయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారని దూబే ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు ఒప్పందాలపై తాను పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తాను తప్ప ఇందులో ఎలాంటి స్వప్రయోజనం లేదని మొయిత్రా ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News