Monday, December 23, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ దర్యాప్తు నిలిపివేతకు సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి కుట్రపన్నినట్లు వెలువడిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయంలో తదుపరి దర్యాప్తును నిలిపివేయాలంటూ మౌఖికంగా ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను, ఇతర సాక్ష్యాలను సిబిఐకి ఇంకా అందచేయలేదని తెలంగాణ పోలీసు తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి తెలియచేశారు. ఈ కేసును జులైలో విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News