కడప: వివేకా హత్య కేసులో సిబిఐ బృందం దూకుడు పెంచింది. కడపకు మరో ప్రత్యేక సిబిఐ బృందం వెళ్లింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సిబిఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. సిబిఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఉదయ్‌ను ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడిగా ఉదయ్ కుమార్ ఉన్నారు. ఉదయ్‌తో పాటు అతడి తండ్రి ప్రకాశ్ రెడ్డి కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగాక భౌతికకాయానికి ప్రకాశ్ రెడ్డి కట్లు కట్టారు. వైఎస్ భారతి తండ్రి ఇసి గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా ప్రకాశ్ రెడ్డి పని చేస్తున్నాడు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌లో ఉదయ్ ప్రస్తావన గురించి సిబిఐ పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ ఎక్కడెక్కడ ఉన్నాడో గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ గుర్తించింది. శుక్రవారం విచారణ తరువాత ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: బాలుడికి ముద్దు పెట్టి తన నాలుక చప్పరించమన్న దలైలామా (వీడియో)