న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచల నం సృష్టించిన కోల్‌కతా వైద్య వి ద్యార్థిని హత్యాచారం కేసును సు ప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.ప్రధాన న్యాయమూర్తి జ స్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనో జ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనున్నది. ఈ సంఘటనను సు మోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రా శారు. ఈ నేపథ్యంలో కేసుకు ఉ న్న ప్రాధాన్యత దృష్టా విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ఈ కే సును కలకత్తా హైకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిబిఐ విచారణ ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు సం జయ్ రాయ్‌కు మానసిక సామ ర్థ్ధ పరీక్షలు నిర్వహించనున్నది. ఈమేరకు ఢిల్లీ లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి కొందరు నిపుణులను సిబిఐ కోల్‌కతాకు పంపించింది.
బాధితురాలి తల్లిదండ్రులు, ఆందోళన చేపట్టిన నిరసనకారులు ఈ నేరం సామూహిక అత్యాచారమని, నిందితులందరికీ శిక్ష పడేలా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించిన దగ్గర నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యురాలి మృతదేహాన్ని చూడడానికి ఆమె తల్లిదండ్రులను ఆలస్యంగా అనుమతించారని, పోస్ట్‌మార్టమ్ నివేదిక కూడా సరిగ్గా లేదని, ఆరోపిస్తున్నారు. వైద్యురాలి మృతదేహంపై అనేక గాయాలు ఉన్నందున ఒకరు కన్నా ఎక్కువ మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు అనుమానం కలుగుతోందని ఆరోపిస్తున్నారు. అలాగే మృతదేహాన్ని పోలీస్‌లు హడావుడిగా అంత్యక్రియలు చేయడంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ అనుమానాలను కోల్‌కతా పోలీస్‌లు తోసిపుచ్చారు.మృతురాలి శరీరంపై కనిపించిన బ్లూటూత్ హెడ్‌సెట్ నిందితుని మెడపై ఉన్నట్టు తరువాత సిసిటివీ ఫుటేజిలో కనిపించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కూడా చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రశ్నల వర్షం
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటనలో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్‌జి కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ అధికారులు 23 గంటలకు పైగా ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన విచారణ శనివారం కూడా కొనసాగింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల సమయంలో ఆయనకు సిబిఐ అధికారులు స్వల్ప విరామం ఇచ్చారు. ఆ సమయంలో సందీప్ ఘోష్ తన నివాసానికి వెళ్లి వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన చేతిలో కొన్ని ఫైళ్లు కనిపించాయి. కాగా, తమ కుమార్తె కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉందని, విధులకు హాజరయ్యేందుకు వెనుకంజ వేయడం గమనించామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
అయితే, ఆమెపై దారుణం జరిగితే ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనుమానాలకు తావు ఇస్తోందని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను విచారిస్తున్నారు. కాగా, విచారణ నిమిత్తం లోపలికి వెళుతూ సందీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. సిబిఐ తనను అరెస్టు చేయలేదని, దయచేసి తప్పుడు సమాచారం వ్యాపింపచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా నిందితుడు సంజయ్ రాయ్‌ను ఎదురుగా కూర్చోబెట్టి, అతని సమక్షంలో తనను విచారిస్తున్నారన్న వార్తల్లో కూడా నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘సిబిఐ అధికారులు నన్ను విచారిస్తున్నారు& ఈ దశలో ఇంతకు మించి ఏమీ చెప్పలేను’ అని సందీప్ ఘోష్ అన్నారు.