Monday, December 23, 2024

విచారణకు హాజరు కావాలని అవినాష్ కు సిబిఐ నోటీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కేసులో ఎంపి అవినాశ్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ అవినాశ్ రెడ్డిని సహ నిందితుడిగా సిబిఐ పేర్కొంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే అవినాశ్‌కు ఐదోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరుకావాలని అవినాశ్‌కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డినికూడా అరెస్ట్ చేశారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News