Monday, November 18, 2024

కవితకు సిబిఐ నోటీసులు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటిసుల్లో ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సిబిఐ అధికారులు ఇంటివద్ద విచారించారు. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఇడి పంపిన నోటీసులకు కూడా ఎంఎల్‌సి కవిత వరుసగా హాజరు కాక పోవడం గమనార్హం.

ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విష యం విదితమే. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం సంచలనమైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కిల్స్‌లో మరోమారు చర్చకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News