Friday, April 4, 2025

నన్ను ఇరికించాలనుకున్న సిబిఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు : సిసోడియా

- Advertisement -
- Advertisement -

Manish Sisodia

న్యూఢిల్లీ: తనను తప్పుడు కేసులో ఇరిక్కించమని ఒత్తిడి పెరగడంతో ఆ సిబిఐ అధికారి చచ్చాడు అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. అధికారులను అంతగా ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రశ్నించారు.  ‘‘నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని సిబిఐ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అతను మానసిక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు… అధికారులపై ఇంత విపరీతమైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని నేను ప్రధానమంత్రిని అడగాలనుకుంటున్నాను ” అని సిసోడియా విలేకరుల సమావేశంలో అన్నారు. సిబిఐకి చెందిన డిప్యూటీ లీగల్ అడ్వైజర్ జితేంద్ర కుమార్ అనే వ్యక్తి గత వారం దక్షిణ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 6.45 గంటలకు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు ఒక వ్యక్తి ఉరివేసుకుని ఉన్నట్లు తమకు కాల్ వచ్చిందని, ఫోరెన్సిక్ మొబైల్ బృందంతో పాటు క్రైమ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిబిఐ గత నెలలో సిసోడియా ఢిల్లీ నివాసంపై దాడులు చేసిందన్నది ఇక్కడ గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News