Monday, December 23, 2024

వైఎస్ వివేకా పీఏను విచారిస్తున్న సీబీఐ అధికారులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. ఈ కేసును విచారించేందుకు సీబీఐ అధికారులు గురువారం కడప నుంచి పులివెందులకు వచ్చారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి నివాసానికి చేరుకున్నారు.

Also Read: ఇంటివద్ద “అలెక్సా” తో పిల్లలకు బలే కాలక్షేపం

తన ఇంటికి సీబీఐ అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి ఇంట్లోనే ఉండి తలుపులు వేసుకున్నాడు. అధికారులు కొద్దిసేపు బయట వేచి ఉండి, చివరికి తలుపు తెరవాలని ఆదేశించారు. కాసేపటి తర్వాత తలుపులు తెరిచి కృష్ణారెడ్డిని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు విచారించారు. గతంలో సీబీఐ అరెస్టు చేసిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో మరోసారి సీబీఐ అధికారులు ఆయనను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News