Friday, December 27, 2024

కవితను విచారిస్తున్న సిబిఐ బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఆమెను ఐదుగురు సభ్యులతో కూడిని సిబిఐ అధికారుల బృందం విచారిస్తోంది. సిబిఐ డిజి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. కవిత నివాసానికి మొత్తం 11 మంది సిబిఐ అధికారులు వెళ్లారు.

లిక్కర్ కుంభకోణం కేసులో నిందుల స్టేట్‌మెంట్ ఆధారంగా సిబిఐ అధికారులు కవితపై ప్రశ్నలు సంధించారు. నిందితుడు అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగానే కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మనీశ్ సిసోడియా, అమిత్ అరోరా, అభిషేక్ విషయంలో ఆమెను సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవాదుల సమక్షంలోనే సిబిఐ బృందం ప్రశ్నిస్తుండటం ఇక్కడ గమనార్హం. కాగా కవిత స్టేట్‌మెంట్లను సిబిఐ అధికారులు రికార్డు చేస్తున్నారు. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి ఉంచారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాకే కవిత విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News