Monday, December 23, 2024

హష్‌ఖలి చేరుకున్న సిబిఐ అధికారుల బృందం

- Advertisement -
- Advertisement -
CBI officers team reached Hanskhali
బాలికపై సామూహిక హత్యాచారం కేసు దర్యాప్తు ప్రారంభం

హష్‌ఖలి(ప.బెంగాల్): తుపాకీతో బెదిరించి అంత్యక్రియల కోసం తన కుమార్తె మృతదేహాన్ని ఎత్తుకెళ్లారని ఆరోపించిన సామూహిక హత్యాచారానికి గురైన బాలిక తండ్రితో మాట్లాడేందుకు సిబిఐ బృందం ఇక్కడకు చేరుకుంది. ఇద్దరు మహిళా అధికారులతో కూడిన సిబిఐ బృందం బుధవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోఇన హష్‌ఖలి చేరుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. హష్‌ఖలి పోలీసు స్టేషన్‌ను సందర్శించిన సిబిఐ బృందం కేసు డైరీని, దర్యాప్తునకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ అధికారి ఒకరు చెప్పారు. బాలిక తండ్రిని కలుసుకుని ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అధికారి చెప్పారు.

తుపాకీతో బెదిరించి నిందితుడు తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి దహనక్రియలు జరిపించాడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తండ్రి బుధవారం ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నిందితుడు బెదిరించినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాన నిందితుడి ఇంటికి కూడా సిబిఐ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై ఏప్రిల్ 4న నిందితుడి ఇంట్లో జరిగిన పార్టీలో సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధాని నిందితుడు టిఎంసి పంచాయత్ సభ్యుడి కుమారుడని బాలిక కుటుంబం ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News