పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో కడప జిల్లా పులివెందులలో పరిస్థితిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భద్రతపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంగళవారం పులివెందులలోని దస్తగిరి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి ఆయన భద్రత వివరాలను అడిగి తెలుసుకుని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే చిన్న చిన్న సందేహాలుంటే తమకు తెలియజేయాలని సూచించారు.
Also Read: షర్మిలకు ఎంపి సాయం… ఆ ఎంపిని బెదిరించిన జగన్: గోనె
మరోవైపు వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మే 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్టు చేయరాదని కోర్టు ఆదేశించింది. అదనంగా, విచారణ సమయంలో అతని నుండి ప్రశ్న, సమాధానాలను వ్రాతపూర్వక/ముద్రణ రూపంలో తీసుకోవాలని సూచించింది. ప్రశ్నావళిని ముందుగానే అందించాలని కోర్టు తీర్పు చెప్పింది.