న్యూఢిల్లీ: బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. సోనాలి ఫోగట్ హత్య కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయనున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించిన కొద్ది రోజులకే కేంద్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర పోలీసులపై సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండు మేరకు ఈ కేసును సిబిఐకి దర్యాప్తు చేయనున్నట్లు సావంత్ ఇటీవల తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. సోనాలి శరీరంపై అనేక చోట్ల గాయపు మరకలు ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఆమె మృతిపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండు చేశారు. సోనాలి వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ గతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని సోనాలి తన తల్లికి కూడా ఫిర్యాదు చేసిందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
CBI Probe in Sonali Phogat’s Death Case