కేంద్ర హోం శాఖ సిఫార్సు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేసిన 1,000 లో ఫ్లోర్ బస్సులపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సిబిఐతో ప్రాథమిక దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు. ఢిల్లీ రవాణా సంస్థ కొనుగోలు చేసిన బస్సులకు సంబంధించి వార్షిక మెయింటేనన్స్ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దీనిపై విచారణకు ఒక ముగ్గురు సభ్యుల కమిటీని జూన్లో నియమించారు. ఒప్పందంలో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించిన కమిటీ దీన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. కాగా..కమిటీ నివేదికను పరిశీలించవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ జులైలో కేంద్ర హోం శాఖకు సిఫార్సు చేయడంతో ఈ వ్యవహారంపై సిబిఐతో ప్రాథమిక దర్యాప్తు జరిపించాలని సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు.