Monday, December 23, 2024

కవితను కోర్టులో ప్రవేశపెట్టిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) నాయకురాలు కె.కవితను సిబిఐ గురువారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఆమెను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్  కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుకు సమర్పించిన తర్వాత ఆమెను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) అరెస్టు చేశాక ఆమెను తీహార్ జైలులో ఉంచారు.

కవిత తామడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా సహకరించడంలేదంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. కాగా కవిత తరఫు న్యాయవాది నితేశ్ రాణా, సిబిఐ వినతిని వ్యతిరేకించారు. ఆమె అరెస్టు అక్రమమని వాదించారు.

సిబిఐ అధికారులు ఇటీవల స్పెషల్ కోర్టు అనుమతి తీసుకుని జైలులోనే ఇటీవల ప్రశ్నించారు. సహ-నిందితుడు బుచ్చి బాబు ఫోన్ నుంచి వాట్సాప్ ఛాట్ ను రికవర్ చేసి, దాని గురించే ఆమెను ప్రశ్నించారు. ఓ భూమి డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎక్సైజ్ పాలసీ ముడుపులుగా చెల్లించిన రూ. 100 కోట్ల మొత్తం విషయంలో కవితన వారు ప్రశ్నించారు.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) మార్చి 15న బంజార హిల్స్ లోని కవిత(46) ఇంట్లోనే  ఆమెను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News