Monday, December 23, 2024

సిబిఐ వంద సార్లు పిలిచినా వెళ్తా…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సిబిఐ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా జైలులో ఉన్నారు. విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో విడుదల చేశారు. తనని అవినీతి పరుడని బిజెపి అంటుందని, తాను అవినీతి పరుడనైతే ఆదాయపు పన్ను శాఖలో పని చేశానని, అవినీతి చేస్తే వంద కోట్లు సంపాందించేవానని బదులిచ్చారు. తాను అవినీతి పరుడైతే ప్రపంచంలో ఒక్క నిజాయితీ పరుడు ఉండడని స్పష్టం చేశారు. సిబిఐ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తాను జవాబు చెబుతానని, తన అరెస్టు చేస్తున్నారని బిజెపి ప్రచారం చేస్తుందని, జైళ్లో పెడుతారని పదే పదే బిజెపి నేతలు ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.

Also Read: బాలుడికి ముద్దు పెట్టి తన నాలుక చప్పరించమన్న దలైలామా (వీడియో)

సిబిఐ వంద సార్లు పిలిచిన కూడా వెళ్తానని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పది సంవత్సరాల క్రితం ఎన్నో ప్రశ్నల మధ్య రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్నో మార్పులు చేశానని, ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేశామని, 30 ఏళ్ల నుంచి గుజరాత్‌లో బిజెపి ఏం అభివృద్ధి చెసిందో చెప్పాలని నిలదీశారు. భారత దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలన్నదే తన జీవిత లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో ప్రతీ రోజు దాదాపుగా 50 యూనిట్ల కంటే ఎక్కువగా ఇన్సులిన్ తీసుకుంటున్నానని, అవినీతి వ్యతిరేకంగా పది రోజులు, 15 రోజులకొక సారి నిరాహార దీక్ష చేశానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News