- Advertisement -
హైదరాబాద్: కాసేపట్లో సిబిఐ కార్యాలయానికి వైసిపి ఎంపి అవినాశ్ రెడ్డి చేరుకోనున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సిబిఐ విచారించనుంది. వివేకా కేసులో అవినాశ్‌ను ఇప్పటికే సిబిఐ నాలుగు సార్లు ప్రశ్నించింది. ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని సిబిఐ విచారించనుంది. విచారణ మొత్తాన్ని సిబిఐ అధికారులు ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయనున్నారు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ను కలిపి సిబిఐ ప్రశ్నించనుంది. సిబిఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ను సిబిఐ ఆఫీస్‌కు అధికారులు తరలించనున్నారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ను సిబిఐ కస్టడీలోకి తీసుకోనుంది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
Also Read: తల్లి కాబోతున్న ఇలియానా.. ఇదేం పద్దతంటున్న నెటిజన్లు
- Advertisement -