Thursday, January 23, 2025

సిబిఐ ఎదుట హాజరుకానున్న గంగుల, గాయత్రి రవి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: నకిలీ ఐపిఎస్ శ్రీనివాస్ రావు సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ అంటూ శ్రీనివాస్ రావు మోసాలు చేస్తున్నారు. సిబిఐ, ఇడి కేసులను సెటిల్మెంట్లు చేయిస్తానని వసూళ్లకు పాల్పడ్డాడు.
ఢిల్లీలో సిబిఐ ముందు మంత్రి గంగుల కమలాకర్, ఎంపి గాయత్రి రవి హాజరుకానున్నారు. నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపి రవిచంద్రను సిబిఐ ప్రశ్నించనుంది. సిఆర్‌పిసి 160 ప్రకారం సాక్షులుగా గంగుల, రవిచంద్ర హాజరయ్యారు. ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులు అందజేశారు. శ్రీనివాస్‌తో పరిచయంపై గంగుల, గాయత్రి రవిని సిబిఐ ప్రశ్నించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News