Friday, April 4, 2025

అవినాశ్ రెడ్డిని నాలుగు గంటలపాటు ప్రశ్నించిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సిబిఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. సిబిఐ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న అవినాశ్ రెడ్డిని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో అధికారులు ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి.
అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా ఆర్థికపరమైన, రాజకీయ అంశాలతో కూడిన కుట్రతో హత్య జరిగి ఉండొచ్చని సిబిఐ భావిస్తోంది. ఈ అనుమాల నివృత్తి కోణంలోనే అవినాశ్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News