- Advertisement -
అమరావతి: దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో సిబిఐ మెరుపు దాడులు చేసింది. ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. గుంటూరులోని కెఎల్ వర్సిటీ యాజమాన్యంపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఎఎసి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ దాడులు చేసింది. మొత్తం 14 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో 10 మందిని అరెస్టు చేశారు. ఎన్ఎఎసి ఇన్‌స్పెక్షన్ టీమ్ చైర్మన్ సమరేంద్ర సహా ఏడుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నిందితుల జాబితాలో వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్ఎఎసి మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథరావు,
ఎన్ఎఎసి అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్ప ఉన్నారు. ఈ నలుగురు మినహా 10 మంది అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
.
- Advertisement -