Monday, December 23, 2024

ఆప్ ఎంఎల్‌ఎ ఇంటిపై సిబిఐ దాడి

- Advertisement -
- Advertisement -

CBI Raids AAP MLA House at Punjab

న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన మూడు ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించింది. అమర్‌ఘర్ ఎంఎల్‌ఎ అయిన జశ్వంత్ సింగ్‌పై నమోదయిన కేసుకు సంబంధించి సంగ్రూర్ జిల్లా మాలెర్ కోట్లాలోని ఆయన పూర్వీకుల నివాసంతో పాటుగా మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.16.57 లక్షల నగదు, 88 విదేశీ కరెన్సీ నోట్లు, కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, పలు బ్యాంక్ ఖాతాలు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిబిఐ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మాలేర్ కోట్లాలోని గౌన్సుపురలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థపై లూధియానా బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది. అప్పటి సంస్థ డైరెక్టర్లు ఓ ప్రైవేటు సంస్థకు చెందిన గ్యారంటీర్లు సహా పలువురు వ్యక్తులు, మరో ప్రైవేటు సంస్థ, గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు/ ప్రైవేటు వ్యక్తులను కూడా నిందితులుగా బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో సిబిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News