Saturday, March 29, 2025

చత్తీస్ గఢ్ మాజీ సిఎం భూపేశ్ భాగేల్ ఇళ్లలో సిబిఐ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ కు చెందిన రాయ్ పూర్, భిలాయ్ లోని నివాసాలలో బుధవారం సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఎన్ ఫోర్డ్ మెంట్ డైరెక్టరేట్ భూపేశ్ భాగేల్ ఇళ్లపై దాదాపు నెల్లాళ్ల క్రితం దాడులు నిర్వహించిన తర్వాత ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశం అయింది. గతంలో ఈడీ దాడుల సందర్భంగా భాగేల్ మద్దతు దారులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడం వంటి చర్యలకు పాల్పడకుండా సీబీఐ కోరికమేరకు సిఆర్ పీఎఫ్ బలగాలను మోహరించి రాయ్ పూర్, భిలాయ్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మహదేవ్ సత్తా యాప్, బొగ్గు, మద్యం కుంభకోణాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు లో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. వీటికి తోడు పిఎస్ సీ స్కామ్ తోనూ దీనిని ముడి పెడుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మాజీ ముఖ్యమంత్రి భాగేల్ ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఓ సమావేశానికి వెళ్లవలసి ఉంది. ఆయన ఢిల్లీకి బయలుదేరక ముందే సీబీఐ రాయపూర్, భిలాయ్ లోని ఆయన ఇళ్లలో తనిఖీలు ప్రారంభించింది. ఏప్రిల్ 8,9 తేదీలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలలో చర్చనీయాంశాలను ఖరారు చేసేందుకు డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది.ఈడీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 10న భూపేశ్ భాగెల్ ఆయన కొడుకు ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2 వేల 100 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని, లిక్కర్ సిండికేట్ వారు విపరీతంగా లాభపడ్డారని ఈడీ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News