Saturday, July 6, 2024

ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు

- Advertisement -
- Advertisement -

CBI Raids Houses of RJD Leaders

పాట్నా: బీహార్‌లో కొత్తగా ఏర్పడ్డ మహా గట్‌బంధన్ సర్కారు బలపరీక్ష ఎదుర్కోడానికి కొన్ని గంటల ముందే ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరపడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పాట్నా లోని ఆర్జేడీ ఎమ్‌ఎల్‌సీ సునీల్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఎ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలపై సింగ్ స్పందిస్తూ ఇప్పటికే ఒకసారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్‌ఎల్‌ఎలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్‌జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్పాక్ కరీం ఇంటిపై కూడా సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ ఐటీఈడీ సిబిఐ దాడులు బీజేపీ దాడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి బీజేపీ కిందే పనిచేస్తాయి. వారి ఆఫీసులను కూడా ఆ పార్టీ స్క్రిప్టే నడిపిస్తుంది. బుధవారం బీహార్ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది. అదే సమయంలో ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అని పేర్కొన్నారు. బీహార్ లోని మహా గట్‌బంధన్ సర్కారులో ఆర్జేడీ 79 మంది ఎమ్‌ఎల్‌ఎలతో అతిపెద్ద భాగస్వామిగా నిలిచింది. రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా 16 శాఖలు ఆర్జేడీ వద్దనే ఉన్నాయి.

CBI Raids Houses of RJD Leaders

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News