Wednesday, January 22, 2025

ఆర్‌జి కర్ ఆస్పత్రి ఘటన… సంజయ్ ఘోష్ ఇంటిపై సిబిఐ దాడులు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఆర్‌జి కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఆర్‌జికర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. కోల్‌కతాలోని 15 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్‌జి కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన ఆర్‌జి కర్ ఆస్పత్రిలో పిజి వైద్యురాలు హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే ఆస్పత్రిలో పని చేసిన డిప్యూటీ సూరింటెండెంట్ అక్బర్ అలీ మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ హత్యాచారం కేసులో నిందితులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసును న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసింది. 25 రోజుల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సిబిఐకి కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News