Wednesday, January 22, 2025

మనీష్ సిసోడియాపై సిబిఐ మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిఘా విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాపై సిబిఐ గురువారం మరో కొత్త అవినీతి కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఒక శాఖ ద్వారా రాజకీయ నిఘా సమాచారాన్ని అక్రమంగా సేకరించారన్న కేసులో సిసోడియాపై కేసు నమోదు చేయడానికి సిబిఐకి గత నెలలోనే కేంద్రం అనుమతి ఇచ్చింది. అవినీతిని అరకిట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ రాజకీయ నిఘాలు నిర్వహించి ఈ సమాచారాన్ని సేకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News