Sunday, January 26, 2025

సిబిఐకి రూ. 928.46 కోట్ల బడ్జెట్ కేటాయింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌లో రూ. 928.46 కోట్లు కేటాయించింది. 2024 ఆర్థిక సంవత్సరం కన్నా రూ. 40.4 కోట్లు తక్కువగా 2024-25 సంవత్సర తాత్కాలిక బడ్జెట్‌లో సిబిఐకి కేటాయింపులు జరిగాయి. 2023-24 వార్షిక బడ్జెట్‌లో సిబిఐకి రూ. 946.54 కోట్లు బడ్జెట్ అంచనాలు జరపగా తర్వాత సవరించిన అంచనాల ద్వారా అది రూ. 968.86 కోట్లకు పెరిగాయి.

2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో సిబిఐకి కేంద్ర ప్రభుత్వం రూ. 928.46 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు చెందిన అవినీతి కేసులతోపాటు ఇతర తీవ్రమైన నేరాలకు చెందిన కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చుల కోసం సిఐఐకి ఈ బడ్జెట్ కేటాయింపులు జరిపినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News