Saturday, December 21, 2024

బహానగా రైల్వేస్టేషన్‌కు సిబిఐ సీల్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఇటీవల ఘోర స్థాయిలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ఒడిషాలోని బహానగా జజార్ రైల్వేస్టేషన్‌కు సీల్ వేశారు. దాదాపు 300 మంది వరకూ చనిపోయిన ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు ఆరంభం అయింది. ఈ క్రమంలో ఈ విచారణ పూర్తి అయ్యే వరకూ ఈ స్టేషన్‌లో ఎటువంటి రైళ్ల నిలిపివేత ఉండదు. ఈ స్టేషన్‌కు సిబిఐ అధికారుల బృందం శనివారం వచ్చి రాకపోకలను నిలిపివేసి, సీల్ చేసింది. మూడు రైళ్ల ప్రమాదం వేదిక అయిన ఈ స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో అణువణువూ పరిశీలనకు సిబిఐ బృందాలు తనిఖీలు చేపడుతాయి.

Also Read: ప్రధాని మౌనం మణిపూర్‌కు ద్రోహం: ఖర్గే

ఈ క్రమంలోనే ఈ స్టేషన్‌ను సీల్ చేసినట్లు వెల్లడైంది. దర్యాప్తు పూర్తయ్యే వరకూ సిబ్బంది కూడా స్టేషన్‌కు రావడానికి వీల్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఇక్కడ నిలిపే ఉంచుతారు. ఈ స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్ ఉండదని అధికారులు వివరించారు. ప్రయాణికుల, సరుకు రవాణాల రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్లుతాయి తప్పితే ఇక్కడ ప్రస్తుతానికి నిలిపే అవకాశం ఉండదు. ఈ స్టేషన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సిబిఐ ఇక్కడి రికార్డులను, లాగ్ బుక్స్‌ను , రిలేప్యానల్‌ను స్వాధీనపర్చుకుంది. సాధారణంగా ఈ స్టేషన్ మీదుగా రోజూ 170 వరకూ రైళ్ల రాకపోకలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ స్టేషన్ వద్ద సిగ్నలింగ్‌వ్యవస్థ సాంకేతిక లోపాలు ఇతర కారణాలతో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఆరంభం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News