Monday, December 23, 2024

ఒడిశా రైలు దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైలు ప్రమాదాల దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు. సోరో పట్టణంలో రైల్వే సిగ్నల్ జెఇ అద్దెకు ఉంటున్న ఇంట్లో అమీర్ ఖాన్ లేకపోవడంతో ఆ ఇంటికి సీలు వేశారు. అనంతరం సిబిఐ సిబ్బంది సిగ్నల్ జెఇ ఇంటిపై నిఘా వేసి ఉంచారు.

సిబిఐ అధికారులు గతంలో రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నించారు. బహనాగా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 292 మంది ప్రయాణికులు మరణించారు. ఈ రైలు ప్రమాద ఘటన తర్వాత సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్, అతని కుటుంబం అద్దె ఇంటి నుంచి నుంచి పారిపోయారని సమాచారం.మరోవైపు సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం బహనాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి కూడా వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News