- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని బఘేల్‌కు చెందిన ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేశారు. బఘేల్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారు ఇంట్లోను సిబిఐ అధికారులు తనిఖీలుచేస్తున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఇడి అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇడి అధికారులు 30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఈ నెల 10న బఘేల్ ఇంటిపై ఐటి రైడ్స్ జరిగిన విషయం విధితమే. తనిఖీలు చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో ఇడి అధికారులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.
- Advertisement -