Sunday, December 22, 2024

సత్యపాల్ మాలిక్ నివాసంలో సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

కిరూ హైడ్రోపవర్ కాంట్రాక్టులో అవినీతి ఆరోపణలు

న్యూఢిల్లీ: కిరూ హైడ్రోపవర్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో నివాసంతోపాటు మరో 29 ఇతర ప్రదేశాలలో గురువారం సిబిఐ సోదాలు నిర్వహించింది. దేశంలోని వివిధ నగరాలలోని 30 ప్రదేశాలలో గురువారం ఉదయం సిబిఐకి చెందిన దాదాపు 100 మంది అధికారులు సోదాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

రూ. 2,200 కోట్ల విలువైఔన కిరూ హ్రైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు సివిల్ పనుల కాంట్రాక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ పవర్ ప్రాజెక్టుతోపాటు మరో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లపై సంతకం పెడితే రూ. 300 కోట్ల ముడుపులు ఇస్తామని తనను ప్రలోభ పెట్టినట్లు 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కశ్మీరు గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ గతంలో ఆరోపించారు. 2019లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పనుల కాంట్రాక్టును ఒక ప్రవైట్ కంపె దక్కించుకుంది.

రూ. 2,200 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు అప్పగింతలో అవినీతి చోటుచేసుందన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి చెనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకె మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌పైన సిబిఐ కేసులు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News