Monday, December 23, 2024

తేజస్వియాదవ్ బెయిల్ రద్దు చేయండి

- Advertisement -
- Advertisement -

CBI seeks cancellation of Tejashwi Yadav bail

ఢిల్లీ కోర్టును కోరిన సిబిఐ

పాట్నా : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ బెయిల్‌ను రద్దు చేయాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సిబీఐ కోరింది. ఐఆర్‌సీటీసి స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఆ సంస్థ ఈ మేరకు తదుపరి చర్యలకు సిద్ధమైంది. దీంతో సిబిఐ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని తేజస్వియాదవ్‌కు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ నోటీసులు జారీ చేశారు. 2006 లో జార్ఖండ్ లోని రాంచీ , ఒడిశా లోని పూరీలో ఉన్న ఐఆర్‌సిటిసి హోటల్స్‌ను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో భారీగా అవినీతి జరిగినట్టు సీబీఐ ఆరోపించింది. బీహార్ రాజధాని పాట్నా లోని కీలక ప్రాంతంలో మూడు ఎకరాల వాణిజ్య ప్లాట్ లంచంగా ఇచ్చినట్టు పేర్కొంది.ఐఆర్‌సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ కేటాయింపులో అవకతవకలకు సంబంధించి 12 మంది వ్యక్తులు, రెండు సంస్థలపై కేసు నమోదు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ , ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సిబిఐ శనివారం కోరింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా వారిపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News