Sunday, December 22, 2024

కవిత విచారణ కోరుతూ సిబిఐ పిటిషన్

- Advertisement -
- Advertisement -

లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు వీలుగా తమకు అప్పగించాలని సిబిఐ కేసు దాఖలు చేసింది. కవితకు గతంలోనే సిబిఐ నోటీసులు జారీ చేయగా, సుప్రీంకోర్టులో ఉన్న కేసును చూపించి ఆమె విచారణకు హాజరు కాలేదు. సిబిఐ 2022 డిసెంబర్ 11న కవితను విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా కవితను మళ్లీ విచారించాలని, ఆమెను తమ కస్టడీకి ఇవ్వవలసిందిగా సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవితను మార్చి 15వ తేదీన ఇడి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News