Sunday, January 19, 2025

వాప్‌కాస్ మాజీ సిఎండి ఇంట్లో నోట్ల గుట్టలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేసేప్రభుత్వ రంగ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీసర్వీసెస్( వాప్‌కాస్) ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్ సిం ఘాల్‌ను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సిబిఐ బుధవారం అరెస్టు చేసింది. ఢిల్లీ, గుర్గావ్, చండీగఢ్, సోనేపట్, ఘజియాబాద్‌లలోని గుప్తాకు చెందిన 19 ప్రదేశాలపై ఏకకాలంలో సిబిఐ నిర్వహించిన దాడుల్లో రూ.38 కోట్లకు పైగా నగదు, పెద్ద మొత్తంలో నగదు. కొన్ని విలువైన వస్తువు లు, ఇతర కీలకమైన డాక్యుమెంట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆదాయ మార్గాలకు మించి ఆస్తులున్నట్లు గుర్తించి గుప్తాపై కేసులు నమోదు చేసినట్లు సిబిఐ మంగళవారం ప్రకటించింది కూడా.

2011 ఏప్రిల్‌నుంచి 2019 మార్చి 31 వరకు వాస్‌కాస్ సంస్థలో గుప్తా పదవీ కాలంలో పెద్ద ఎత్తున ఆక్రమార్జనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గుప్తా, ఆయన భార్య రీమా సిం ఘాల్, కుమారుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్‌లపై ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసిన సిబిఐ అధికారులు దేశవ్యాప్తంగా 19 చోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాల్లో మంగళవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకాగా, బుధవారం మరో 18 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్లు అధికార ప్రతినిధి తె లిపారు. రిటైరయిన తర్వాత గుప్తా ఢిల్లీలో ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా ఆరోపణలున్నాయి. స్థిరాస్తుల్లో పలు ఫ్లాట్లు, కమరిషయల్ ప్రాపర్టీస్‌తో పాటుగా ఢిల్లీ, గురుగ్రామ్, పంచకుల,సోనిపట్, చండీగఢ్‌లో ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు ఆరోపణలున్నాయని ఆ అధికారి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News