Friday, December 20, 2024

మంత్రి గంగులకు సిబిఐ నోటీసులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, టిఆర్‌ఎస్ ఎంపి గాయత్రి రవికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. నకిలీ సిబిఐ అధికారి పేరుతో మోసాలకు పాల్పడిన శ్రీనివాస్ కేసులో విచారణకు రావాలని నోటీసులు అందజేసింది. విట్నెస్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరింది. కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు నకిలీ ఐపిఎస్ పేరుతో మోసాలు చేసిన శ్రీనివాస్ కేసులో నోటీసులు అందజేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

అయితే సిబిఐ అధికారులు గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లిన సమయంలో.. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం ఢిల్లీలో నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్‌ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్, గాయత్రి రవిలతో కలిసి శ్రీనివాస్ ఉన్న ఫోటోలను గుర్తించిన సిబిఐ.. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, నకిలీ సిబిఐ అధికారి ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

CBI serve Notice to Minister Gangula Kamalakar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News