న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం(ఏప్రిల్ 16) ప్రశ్నలకు జవాబులిచ్చేందుకుగాను రావాలని సిబిఐ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇదివరలో ప్రశ్నించేందుకు పిలిచి, అరెస్టు చేశారు. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చారు.
గోవా పోలీసులు కూడా ఏప్రిల్ 27న హాజరు కావలంటూ సమన్లు జారీచేశారు. ప్రజా ఆస్తులను డిఫేస్‌మెంట్ చేశారన్న ఆరోపణ కింద గోవా పోలీసులు విచారణకు పిలిచారు. గమనించాల్సిన విషయమేమిటంటే సిబిఐ మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ కేసు ఫ్రాడ్ వెనుక కేజ్రీవాల్ హస్తం ఉందని బిజెపి అంటోంది.
ఎన్నికల సంఘం ‘ఆప్’ను జాతీయ పార్టీగా అధికారికంగా గుర్తించినందున జైలుకు వెళ్లడానికి ఆప్ నాయకులు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు.