Monday, January 20, 2025

మణిపూర్ హింసాకాండ… 27 కేసులపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్రపోలీస్‌లు తమకు అప్పచెప్పిన 27 కేసులపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. వీటిలో 19 మహిళలపై నేరాలకు సంబంధించినవి కాగా, మూడు ఆయుధాల లూటీ, రెండు హత్యలకు, అల్లర్లు, హత్య, కిడ్నాపింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించి ఒక్కొక్క కేసు ఉన్నాయి. అయితే సిబిఐ ఈ కేసులను మళ్లీ నమోదు చేసుకుంది. అయితే ఈశాన్య రాష్ట్రమంతా ఉద్రిక్తంగా ఉండడంతో ఆ కేసుల వివరాలను వెల్లడించలేదు. నేర ప్రాంతాలను సందర్శించిన తరువాత నిందితులను సిబిఐ బృందాలు ప్రశ్నించడం ప్రారంభించాయి. దేశం మొత్తం మీద వివిధ విభాగాల నుంచి 29 మంది మహిళా అధికారులతోసహా మొత్తం 53 మంది విచారణాధికారులను తమ బృందంలోకి సిబిఐ చేర్చుకుని దర్యాప్తు ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News