Monday, November 18, 2024

సిబిఐ బృందంపై బీహార్ గ్రామంలో దాడి

- Advertisement -
- Advertisement -

యుజిసి నెట్ పరీక్ష అక్రమాలపై దర్యాప్తునకు బీహార్‌కు వచ్చిన సిబిఐ బృందంపై స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటన బీహార్‌లోని నవాడాలో జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షల్లో అక్రమాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఈ ప్రాంతంలోని కసియాదీ గ్రామానికి సిబిఐ బృందం వెళ్లింది. ఇక్కడికి వచ్చిన వీరి వాహనాన్ని స్థానికుల గుంపు చుట్టుముట్టింది. అధికారులను నెట్టివేశారు. వారిని ముందుకు కదలనివ్వలేదు. దీనితో సిబిఐ బృందం స్తానిక ఠాణాకు ఫోన్‌లో విషయం తెలిపింది. దీనితో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. తమపై స్థానిక గుంపు దాడికి దిగేందుకు యత్నించిందని పేర్కొంటూ సిబిఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజౌలి పోలీసు స్టేషన్ అధికారులు తెలిపారు. సిబిఐ బృందంపై దాడికి దిగిన నలుగురిని గుర్తించి తరువాత వారిని జైలుకు పంపించారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రస్తావన మేరకు యుజిసి నెట్ పేపర్ లీక్ విషయంలోసిబిఐ గురువారం గుర్తు తెలియని వ్యక్తలపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో బీహార్‌లో కేసు దర్యాప్తునకు ఈ గ్రామానికి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News