Thursday, January 23, 2025

అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ బృందం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: కడప జిల్లాలోని పులివెందులలో ఎంపి అవినాష్ నివాసానికి సిబిఐ బృందం వెళ్లింది. రెండు వాహనాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొన్న ఉదయ్, నేడు భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ను ఇప్పటికే నాలుగు సార్లు సిబిఐ ప్రశ్నించింది. కడప ఎంపి అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో అవినాష్ రెడ్డి ఇంటికి సిబిఐ బృందం వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News