Wednesday, January 22, 2025

సంజయ్ రాయ్‌కు నిజ నిర్ధారణ పరీక్ష

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక డాక్టర్‌పై హత్యాచారం ఘటన సందర్భంగా అరెస్టు చేసిన సంజయ్ రాయ్‌పై నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని సిబిఐ యోచిస్తున్నట్లు అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. రాయ్‌పై ఈ పరీక్ష నిర్వహణకు అనుమతి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ నగరంలోని సీల్డా కోర్టుకు విజ్ఞప్తి చేసిందని ఆయన తెలియజేశారు. ‘రాయ్ నిజం చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవడానికే ఇది ప్రధానంగా ఉద్దేశించినది. ఈ పరీక్ష వల్ల అతని వాదనను ధ్రువీకరించుకోవడం వీలు అవుతుంది’ అని ఆ అధికారి ‘పిటిఐ’తో చెప్పారు. నిందితుని సీల్డా కోర్టుకు తీసుకువచ్చారు. ఈ పరీక్ష నిర్వహణకు తనకు ఏమైనా అభ్యంతరం ఉందేమో తెలుసుకోవడానికి అతనితో న్యాయమూర్తి స్వయంగా మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News