Saturday, November 16, 2024

వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది: సిబిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలను వెల్లడిస్తూ సీబీఐ తాజాగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నందున అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని, అవినాష్‌రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాలని సీబీఐ కోర్టును కోరింది.

విచారణ నుంచి తప్పించుకునేందుకే అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ కేసులో గొడ్డలి ఎక్కడుందో కస్టడీ విచారణలో తెలుసుకోవాలని సిబిఐ తెలిపింది. హత్యకు రూ.4 కోట్ల లావాదేవీలపై అవినాష్ రెడ్డి ని ప్రశ్నించాలని సిబిఐ కోరింది. సునీల్ యాదవ్ తో అవినాష్ రెడ్డికి సంబంధంమేంటో తెలియాలి. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలు ధ్వంసంలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ ఆరోపిస్తుంది. అవినాష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది… 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిబిఐ పేర్కొంది. హత్యలో సునీత, రాజశేఖర్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డి ప్రమేయంపై ఆధారాల్లేవని సిబిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News